Monday, January 6, 2014

తొలి నాళ్లలో పాత నిబంధన గ్రంథములోని పుస్తకముల సంఖ్య ఎన్ని?

పాత నిబంధన గ్రంథములోని పుస్తకముల సంఖ్యను నిర్ణయించే విషయమై క్రీస్తు శకము 1 శతాబ్ధము నుంచే యూదు పండితుల మధ్య విభిన్న అభిప్రాయములు నెలకొన్నవి. ప్రస్తుతము పాత నిబంధన గ్రంథములోని పుస్తకములన్నీ తొలి నాళ్లలోనే ఉన్నవి. అయితే వాటిలో కొన్ని పుస్తకములను ఒకే గ్రంథముగా చేయుట వలన ఇప్పటికన్నాఅప్పట్లో పాత నిబంధన గ్రంథములోని పుస్తకముల సంఖ్య తక్కువగా ఉండేది.

22 పుస్తకముల కోసము ప్రయత్నము

పాత నిబంధన గ్రంథముగా నేడు వ్యవహరిస్తున్న యూదు పవిత్ర లేఖనముల్లో మొత్తము ఎన్ని పుస్తకములు ఉండాలనే విషయమై క్రీస్తు పూర్వము నుంచే కసరత్తులు జరిగాయి. క్రీస్తు శకము 100 సంవత్సరములో యెరూషలేముకు పడమరనున్న జామ్నియాలోని యూదు అధ్యయన కేంద్రములో యూదు పండితులు మధ్య విషయమై తర్జన భర్జనలు జరిగేవి. పాత నిబంధల లేఖనములు వ్రాయబడిన హెబ్రీ భాష అక్షరమాలలో 22 అక్షరములు ఉండటంతో యూదు లేఖనముల్లో కూడ 22 గ్రంథములే ఉండాలని పలువురు వాదించి యున్నారు. యోసీఫస్ (క్రీస్తు శకము 37-100) అను యూదు చారిత్రకారుడు సైతము యూదు లేఖనముల్లో 22 గ్రంథములే ఉండాలని కొందరు యూదు పండితుల సహకారముతో ప్రయత్నించి యున్నాడు. అయితే 24 గ్రంథములు ఉండలన్ని యూదు పండితుల్లో వేరొక వర్గము వాదించినది. ప్రకారము 24 గ్రంథములు ఉండే విధముగా మొదట మూడు భాగములుగా పాత నిబంధన లేఖనములను విభజించిరి.


అది ఎలాగో చూద్దాము.
1. తోరా = 5 గ్రంథములు
మొదటి భాగమునకు 'తోరా' అని పేరు. హెబ్రీ భాషయందు పదమునకు 'బోధించు' అని అర్థము. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమును మోషే బోధించుట వలన ఆయన వ్రాసినట్లు భావిస్తున్న పంచకాండములకు తోరా అనే పేరును పెట్టియున్నారు. ఆదికాండము, నిర్గమ కాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము అనునవి పంచకాండములు.


2. ప్రవక్తల గ్రంథములు = 8 గ్రంథములు
రెండవ భాగమునకు నెబియీమ్ అని పేరు పెట్టియున్నారు. పదమునకు హెబ్రీ భాష యందు ప్రవక్తలు అని అర్థము. ఇందులో పూర్వపు ప్రవక్తలు మరియు తరువాతి ప్రవక్తలు అని రెండు విభాగములు ఏర్పరచియున్నారు.
a. పూర్వపు ప్రవక్తలు: 4 గ్రంథములు
యెహోషువ, న్యాయాధిపతులు, 1, 2 సమూయేలు (ఒకే గ్రంథము), 1, 2 రాజులు


(ఒకే గ్రంథము)
b. తరువాతి ప్రవక్తలు: 4 గ్రంథములు
యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, 12 మంది చిన్న ప్రవక్తలు రాసిన గ్రంథముల

(హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీఖా, నహూము, హబక్కూకు
జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ) సముదాయము.


3. పరిశుద్ధ వ్రాతలు: 11 గ్రంథములు
మూడవ భాగమును కెతిబియీమ్ గా పిలుచుచున్నారు. పదమునకు హెబ్రీ భాష యందు 'వ్రాతలు' అని అర్థము. దానినే తెలుగులో 'పరిశుద్ధ వ్రాతలు'గా వ్యవహరిస్తున్నారు.
a. యోబు, కీర్తనలు, సామితెలు = 3
b. దానియేలు, 1, 2 దినవృత్తాంతములు (ఒకే గ్రంథము), ఎజ్రా, నెహెమ్యా (ఒకే  గ్రంథము) = 3


c. అయిదు చుట్టలు:
ప్రవక్తలు (కెతిబియీమ్) లో ఒక భాగమే అయిదు చుట్టలు. దీనిని హెబ్రీ భాషలో 

మెగిలోత్ అందురు. పదమునకు హెబ్రీ భాషయందు చుట్టలు (Scrolls) అని

అర్థము. పరమగీతము, రూతు, ప్రసంగి, ఎస్తేరు, విలాపవాక్యములు అనే అయిదు
గ్రంథముల సముదాయమునే అయిదు చుట్టలు అని అందురు.

No comments:

Post a Comment