Monday, January 6, 2014

పాత నిబంధన యొక్క లేఖనముల మూలప్రతులు ఏ భాషలో వ్రాయబడినవి?

పాత నిబంధన లేఖనముల యొక్క మూల ప్రతులు భాషలో వ్రాయబడియున్నవో చెప్పుటకు కచ్చితమైన ఆధారములు లేవు. క్రీస్తు పూర్వము చేపట్టిన లేఖనములు సేకరణలో లభించిన పురాతన లేఖనములు హెబ్రీ భాషలో ఉన్నవి. అందులోని కొన్ని అతి కొద్ది భాగములు మాత్రము ఆరాము (సిరియా) భాషలో ఉన్నవి. పురాతన ప్రతుల్లోని భాషే మూలప్రతుల్లోని భాషగా ఉన్నట్లయితే పాతనిబంధన లేఖనముల మూలప్రతులన్నీ హెబ్రీ భాషలో వ్రాయబడినట్లు భావించవలసియున్నది. పాత నిబంధన లేఖనముల మూలప్రతులను హెబ్రీ భాషలో వ్రాశారని విశ్వసించుటకు కొన్ని కారణములు సైతము కలవు.

పంచకాండముల గ్రంథకర్త మోషేగారు అని క్రీస్తు పూర్వము కొన్ని శతాబ్ధముల కాలము నుంచి యూదుల్లో అచంచలమైన నమ్మకము ఉన్నది. అలాంటి మోషే గారు గ్రీకు భాషను నేర్చినప్పటికీ స్వతహాగా హెబ్రీయుడు. అందువలన ఆయన హెబ్రీ భాశలోనే పంచగ్రంథములను రచించినట్లు విశ్వసించుచున్నారు. యూదు లేఖనముల్లో అతిపురాతనమైనవి క్రీస్తు పూర్వము సుమారు 1300 సంవత్సరముల కాలము నాటివి. ఇది మోషేగారి కాలము తరువాత సుమారు ఒకటిన్నర శతాబ్ధ కాలము. దీనిని బట్టి పాతనిబంధన లేఖనముల్లో పంచకాండముల మూల ప్రతులు హెబ్రీ భాషలోనే వ్రాసియున్నారని గట్టిగా విశ్వసిస్తున్నారు. అలాగే మిగతా గ్రంథములను కూడ హెబ్రీ భాషలోని వ్రాసియున్నారని, క్రీస్తు పూర్వము నందు సేకరించిన యూదు లేఖనములన్నీ మూలప్రతులకు తిరగరాయబడిన ప్రతులని విశ్వసిస్తున్నారు.


పాత నిబంధన లేఖనముల్లో ఆరాము భాషా భాగాలు


పాత నిబంధన లేఖనముల మూల ప్రతుల్లో కొన్ని భాగములు ఆరాము భాషలో కనిపించును. ఎజ్రా, యిర్మీయా మరియు దానియేలు గ్రంథములందు కొన్ని అధ్యాయములు ఆరాము భాషలో ఉన్నవి. ఎజ్రా 4 : 8 నుంచి 6:18 వరకు, 7 : 12 - 26, యిర్మీయా గ్రంథమందు 10:11 మరియు దానియేలు గ్రంథమందు 2 : 4 నుంచి 7 : 28 వరకు ఆరాము భాషలో వ్రాయబడి యున్నవి. తర్జుమా సమయములో భాగములను సైతము అనువదించడంతో తెలుగు తదితర భాషా బైబిలు యందు భాగములను సులువుగా గుర్తించలేము. అయితే ఆయా వచనములను క్షుణ్ణముగా పరిశీలించుట ద్వారా అక్కడ ఆరాము భాష వచనములు ఉన్నవనే విషయమును గ్రహించవచ్చును.


* "అర్తహషస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసిపంపిరి. యుత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది" ఎజ్రా 4:7


పై లేఖనములో పేర్కొనబడిన సిరియా భాషయే ఆరాము భాష. దీనినే కల్దీయుల భాష అని కూడ అందురు. ఎజ్రా 4:8 నుంచి వ్రాయబడిన భాష ఏమిటనే విషయమును దాని ముందు వచనము స్పష్టము చేయుచున్నది. అలా వ్రాయబడిన ఉత్తరములోని విషయము ఎజ్రా 6 : 18 వరకు కొనసాగును.


* "రాజైన అర్తహషస్త, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రీయు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము, మొదలగు మాతలు వ్రాసి యీలాగు సెలవిచ్చెను" ఎజ్రా 7 : 12


ఎజ్రా 4:7 యందు అర్తహషస్తకు వ్రాసి పంపబడిన ఉత్తరము సిరియా (ఆరాము) భాషయందు వ్రాయబడియున్నదనే విషయము గ్రహించియున్నాము. అనగా అర్తహషస్త ఆరాము భాషవాడనే విషయము గ్రహించగలము. ఎజ్రా 7 : 12 నందు ఎజ్రాకు అర్తహషస్త పంపిన తాకీదులో కూడ ఆరాము భాషయే ఉండునని గ్రహించగలము. తాకీదులోని విషయము 26 వచనము వరకు కొనసాగును.


* "కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి - " దానియేలు 2 : 4


పై వచనము ఆధారముగా సిరియా (ఆరాము) భాషలో ఒక విషయము చెప్పబడుచున్నది అనే సూచనను గ్రహించగలము. దానియేలు 2 : 4 యందు ఆరాము భాషలో అలా మొదలైన లేఖన భాగములు దానియేలు 7 : 28 వరకు కొనసాగును.


విధముగా పాతనిబంధన లేఖనముల్లో ఎజ్రా, యిర్మీయా మరియు దానియేలు గ్రంథములయందు కొన్ని భాగములు ఆరాము భాషయందు కనిపించును.

No comments:

Post a Comment