Tuesday, January 7, 2014

బైబిలు గొప్పదనం


అక్షర జ్ఞానం లేని పామరుడైనా సరే బైబిలులోని సారాంశం తెలిస్తే చాలు, నేటి విద్యావంతులకు ధీటుగా విషయ పరిజ్ఞానం పొందినట్టే. శాస్త్ర సాంకేతిక రంగం, ఖగోళం, అంతరిక్షం, వైద్యం, భూగర్భం, విమాన శాస్త్రం ఇలా ఎన్నో రంగాల గురించి కొద్దో, గొప్పో విషయాలు గ్రహించినట్లే. నేటి సామాజిక పరిస్థితులకు తగిన చట్టాలు, లోకొక్తులు, సూక్తులు, జనరల్ నాలెడ్జ్ వంటి విభిన్న అంశాలపైన తిరుగులేని పట్టు సాధించినట్లే. అంతగా అనంత విషయాలను అక్షర రూపంలో బైబిలు తనలో నిక్షిప్తం చేసుకుంది. నేడు శాస్త్రవేత్తలు కనిపెట్టె పలు విషయాలు ఇప్పటికే బైబిలులో శాస్తీయంగానే ఉన్నాయి. అద్భుత విషయాల సంక్షిప్త సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం!...

  • అనంత విశ్వం పుట్టుక గురించి తెలుసుకోవటానికి నేటికీ శాస్త్రవేత్తలు కృషి చేస్తూనే ఉన్నారు. అయితే విశ్వం పుట్టుక గురించిన ప్రాథమిక సమాచారాన్ని బైబిలు అందిస్తుంది.
  • మన సూర్య కుటుంబం ఏర్పడి సుమారు 500 కోట్ల సంవత్సరాలు అయ్యిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే సూర్య కుటుంబం ఏర్పడి అన్నే సంవత్సరాలు అయ్యిందని బైబిలు కూడా చెబుతుంది.
  • భూమి మీద జీవం పుట్టుక మొదలుకొని మానవ జాతి ఆవిర్భావ క్రమం వరకు శాస్త్రవేత్తలు వివరించిన విషయాలనే బైబిలు కూడా విశదీకరిస్తున్నది.
  • శాస్త్రవేత్తలు పేర్కొంటున్న మానవ నాగరికత పరిణామ క్రమము వివరణనే బైబిలులో కూడా చూడొచ్చు.
  • కాల గర్భంలో కలిసిపోయి నేడు వెలుగు చూస్తున్న అతి ప్రాచీన చరిత్రకు సంబంధించిన పలు విషయాలు బైబిలులోఅక్షర సత్యాలుగా ఉన్నాయి.
  • సైన్స్ విద్యార్థులు చదువుకునే డీఎన్ఏ, జన్యువులకు సంబందించిన ప్రస్తావన బైబిలులో అంతర్లీనంగా కనిపిస్తుంది.
  • నేటి న్యాయశాస్త్రానికి ధీటైన చట్టాలను, శిక్షలను గురించి బైబిలు విపులీకరిస్తుంది.
  • భారత దేశంతో బైబిలులోని చారిత్రక ఘటనలకు ఉన్న రాజకీయ, పరిపాలన సంబందాలను గురించి చెబుతుంది.
  • ప్రస్తుతం హిందువులు ఆచరిస్తున్న పూజలు, జంతు బలులు, మొక్కుబడులు యూదులు సైతం ఆచరించిన వాస్తవం బైబిలులో చూడొచ్చు.
  • ప్రస్తుతం కనుమరుగైన అరుదైన జీవజాతులు, వాటి భౌతిక నిర్మాణ తీరును బైబిలు వివరిస్తుంది.
  • మానవాతీతులతో మానవులకు ఉన్న అవినావభావ సంబందాలను స్పష్టం చేస్తుంది.
  • ఇలాంటి మరెన్నో విషయాలను ఇముడ్చుకున్న అద్భుత గ్రంథమే బైబిలు.

No comments:

Post a Comment